Friday, July 5, 2019

1810

1810
Telugu rachana
11/11/2018
==========================
నీ ప్రేమలోన ఎంతెంత హాయి
ఈ స్మరణకూడా వింతయినదోయి
పదిలంగా నన్ను యెదనుండనీవే
ఈ జన్మకైనా మరుజన్మకైనా

ఆ చందమామ మరియేలనేమి
అరవిందమొలికే నగుమోముజాలు
పరిమళము ఎదజల్ల మరుమల్లెలేల
మధురిమలు విరజిల్లు నీ హృదయముఁడ

ఏ మలయ కెరటాలు ఇటువీచినా గాని
నీ వొడిలో పవళించు హాయుండదోయి
సన్నాయిరాగాలు శతకోటి ఉన్నా
నినుజేరి శయనించు హాయయితే రాదోయి

ఏమాయమంత్రాలు బందించునంత
కనుచూపుతోనన్ను బందించినింత
చలియింపకోయి నయనాలు నీవి
సమసయితేబోనీ కనుపాపనయ్యి

నీ ప్రేమలోన ఎంతెంత హాయి
ఈ స్మరణకూడా వింతయినదోయి
పదిలంగా నన్ను యెదనుండనీవే
ఈ జన్మకైనా మరుజన్మకైనా
=========================
...... యలమంచిలి వెంకటరమణ...✍

No comments:

Post a Comment