1805
Telugu Rachana
19/11/2018
=====================
అర్రులుజాచుకు చూస్తుంధదిగో
అత్యాచారం హద్దులుమీరి
హద్దులు మీరిన పాపంజూడు
స్తిగ్ధం జేసెను నిన్నూ-నన్నూ.
కాస్తా కూస్తా అనుకున్నారా?
పాతుకుబొయెన్ పాపంచూడు.
దీపంపెట్టే ధమనుల్లేక
పాతుకుపోయెను పాపంరూడై
ముంచేటోళ్ళ మూర్తులుబెట్టి,
మొక్కేతీరే మారలయ్యా.
దుమ్ములుసైతం పీల్చేస్తుంటే
దన్నంపెట్టే తీరేందయ్యా?
దాసోహాలను దహనంజేసే
ధైర్యంబుట్టే దెప్పటికయ్యా?
దుమ్ములు విరిచే దెప్పటికయ్యా
యువతా నీకా శక్తుందయ్యా
తెగులుగమారిన తీరునుజూసి-
తెగనరుకయ్యా అంకినకాడికి.
అప్పుడుగాని అంతం కాదు
సప్పుడుజేయక సమరంబూను.
=====================
..................య.వెంకటరమణ
No comments:
Post a Comment