1814
Telugu Rachana
19/11/2018
======================
ప్రజాస్వామ్యమిది ప్రజల దేశము
ప్రధమ హక్కులే ప్రక్కవాటము
పడిగాపులు పడిపడి జనముల్
పడగలక్రిందే పవళ పాన్పులు
కులభేదాలు కుతుంత్రాలతో
కుళ్ళిన జనాల కుహనబుద్దితో
వయసుమళ్లిన స్వరాజ్యమాతకు
ఒరిగిందేమిటి వయససొకటేనోయ్
వంతులుమారి వంచనజేస్తూ
ఒకడికి మించి ఒక్కడొస్తుంటే
వేసారిపోతూ జనాలు పాపం
అమాసలోనే వెన్నెలగీతం
కుప్పలు కుప్పలు మక్కారోళ్ళ
లెక్కలకందని ఆస్థుపాస్తులు
గడిగడి గండం గంజి పానకం
బడుగుజీవుల బడలినబ్రతుకులు
బాల్యం ఎరుగని బిడ్డలెందరు
భవితల్ గానని యువతలెందరు
బరిగీతాల్లో భాగ్య రేఖలు
బజారు వేలం బీదబ్రతుకులు
బుల్లెట్టు రైలుకు ఎత్తాయాలు
బులిబులి గుడిసెలు భత్యంకొరతలు
ఇంకా ఇంకా ఇంకెన్నాళ్ళూ
ఇంకిన కళ్ళకు ఓదార్పునీళ్లు
==================
యలమంచిలి వెంకటరమణ
No comments:
Post a Comment