Friday, July 5, 2019

1806

1806
TELUGU RACHANA
04/11/2018
================
కుటిల నీతియు పెరిగె
కుహన బుద్దులు పెరిగె
పెరిగి మనిషి నేడు
నేల మరిచెను జూడు

నీతి నియమమెపుడు
వీడు వదలి నపుడే
నిధన మయిన మనిషి
నికరమాయె నపుడే

స్వార్ధ మింత పెరిగె
పరిజనులు పరులాయే
దిషణ మెటుల బోయె
దిగజారె పశువల్లే

నగలు పొదిగిన బొమ్మ,
నదిఎంత పిరమయిన
పణ్యమందు పణము పది ఇంతలయినేమి
పణికించ నదిఎపుడు పనికిరాదూ
=====================
యలమంచిలి వెంకటరమణ..✍

No comments:

Post a Comment