1807
Telugu rachana
08/11/2018
==========================
చిలుకంటే నాకిష్టం
నీ పలుకంటే నాకిష్టం
పెదవులపై మధువొలికే
నీ నవ్వు నాకిష్టం నాకిష్టం
అదిరేటి అదరాలు నాకిష్టం
నీ నుదిట ముంగురులు నాకిష్టం
సొగసొలికే కనులంటే నాకిష్టం
నాకిష్టం నాకిష్టం,నీవంటే నాకిష్టం
బెదిరేనీ కనులంటే నాకిష్టం
కనువిందు నీ అందం నాకిష్టం
హిమమగునీ హృదయంలో
నేనుండన్ నాకిష్టం నాకిష్టం
కలకాదే ఇదిసత్యం ఇదిసత్యం
నీఒడిలో నేస్వర్గం హాస్వర్గం
గుసగుసలా స్వరమంటే నాకిష్టం
నువ్ లేనీజీవితము ఊహాలకే అదికష్టం
==========================
యలమంచిలి వెంకటరమణ...........✍
No comments:
Post a Comment