Friday, July 5, 2019

1807

1807
TELUGU RACHANA
02/12/2018
==============================
కొండ కోన కొంటె  ఆటలు, కోమలాంగి పూలబాటలు
ఒంపు సోంపు వయారాలు, ఉరకలేయు సెలయేర్లు
వంగి వంగి తొంగి జూచు, లే లేత చిగురు కొమ్మలు
రంగులతో రంగరించి రమణీయం రమణీయం
ఎంత మధురమీ ప్రకృతి, ఇది ఎంత మధురము

మరి యేదో  చెప్పాలని  మలయమారుతం
నేల కొంగి నన్ను తాకె మనసు పరవశం
అక్షింతల గిలిగింతల వాన చినుకులు
పులకించే నేలతల్లి ఒలికించే ఈ సొంపులు
ఎంత మధురమీ ప్రకృతి, ఇది ఎంత మధురము

బంగారపు వన్నెలతో బాను వెలుగు కిరణాలు
ప్రతి బింబం పరవళ్ళు అలలు చేయు సంబరాలు
గూడు విడిచి బారుదీరి విహరించే ఈ పక్షులు
తెల్లబోయి తెరదీసిన నల్లమబ్బు నివాళులు
ఎంత మధురమీ ఉదయము, ఎంత మధురము

ఎత్తవోయీ కుసుమ సల్లాప స్వరమాల
గొంతెత్తి పాడవోయి మధువు లొలుకు భావాలు
రెప రెపల తెరచాప మరుగు తీపి గానాలు
పుణికి పుచ్చుకున్న పడతి అందచందాలు
ఎంత మధురమీ రాగ మెంత మధురము
========================  
యలమంచిలి వెంకటరమణ (తెలుగు రచన)

No comments:

Post a Comment