Friday, July 5, 2019

1767

1767
తెలుగు రచన
05/07/2018
=================
ప్రాణానికి ఊపిరి  నేను
అలసటలో సేదను నేను
ఆకలికే అభయం నేను
ఆయువుకే మందున్నేను

అనాదిగా ఒంటరి నేను
అందరికి వాసము నేను
ఎందరికో తల్లిని కూడా
అయినా నేనొంటరినేను

ఎందరికో తల్లిని నేను
నా బిడ్డల నెరుగన్నేను
నీవిసిరేస్తే పెరిగిన్నేను
నీకోసం బ్రతికుంటాను

నీకోసం బ్రతికుంటాను
కొడితే నే రోధిస్తాను
కాదని ఎటు పొగలను
నీకోసం బ్రతికుంటాను

ఔషధమై ఆపదనుంటా
నీకాఆహారం నేనై ఉంటా
నా అక్కున జేరిన్నీకు
కాదనకే ఆసర గుంటా

పండుగలో నిండుగ నేను
పబ్బంలో విందూ నేను
నీ నుండేమాశించకనే
నామట్టుకు బ్రతికేస్తుంటా

నా మట్టుకు బ్రతికేస్తుంటా
నీ కోసం జీవిస్తుంటా
నన్నెప్పుడు చంపేస్తారో
నని ఎప్పుడు విలపిస్తుంటా

ఎంతెదిగి ఏమౌతాను
అంతంతై చెట్టవుతాను
నీ వేటుకు పడిపోతాను
ఎండెండీ  కట్లవుతాను

ఎండెండీ  కట్లవుతాను
వదిలెయ్ నే బ్రతికుంటాను
బ్రతికీ నిను బ్రతికిస్తాను
నామట్టుకు నే బ్రతికేస్తాను

నా నీడన పెరిగిన బిడ్డా
నను చంపకు బాధేస్తుంది
బాదంతా ఒకటే బిడ్డా
నే చనిపోతే నువ్ బ్రతికేదెట్లా?
===================
"చెట్టును కాపాడు.అది నిన్ను కాపాడుతుంది"
===================
యలమంచిలి వెంకటరమణ..✍

No comments:

Post a Comment