Friday, July 5, 2019

1809

1809
TELUGU RACHANA
11/11/2018

      ( ఇది హస్యమా?)
==================
వేసుకుంటాం గానీ సూటుబూట్లు
పైనుంచి కిందవరకు చెమట్లు
కనిపిస్తాయా మా బనేనుకున్న తూట్లు
ఎవరికి చెప్పాలీ మగపాట్లు

పడుతూ పడుతూ కునుకుపాట్లు
పైసా కోసం పడే అగచాట్లు
పైనుండి అధికారుల తిట్లు
తిట్టడం కోసమే జీతమిస్తున్నట్లు

ఎట్లానో తెచ్చి పెడుతుంటే నోట్లు
ఇంతేనా అన్నట్టు చేసే ఆ చూపులతూట్లు
ఎవరికి చెబితే ఎవరింటారు మా పాట్లు
ఎన్ని తెచ్చినా పడాల్సిందే సూటిపోటి మాట్ల్

ఎలావస్తున్నాయో పక్కాడికాకోట్లు
మాకు తప్పట్లేదు మోకాలుపోట్లు
తెల్లవారితే మొదలు మా పాట్లు
తెల్లవార్లూ మోజేతిపోట్లు

ఇరుకు కదా ఇంతే ఈ ఇక్కట్లు
అవసరాల్జూస్తే లాట్లుకులాట్లు
విలాసాల కిరుప్రక్కలా బ్రాకెట్లు
అయినా అంతే ఓవర్ బడ్జెట్లు

తిరిగి తిరిగి మోకాళ్ళపోట్లు
బహుమానంగా రక్తపోట్లు
జేబుల్లో మధుమేహం టాబ్లేట్లు
ఇరకాటంలో తప్పని ముంజేతిపోట్లు

బయట ఒత్తుడ్లు ఇంట్లో మొత్తుడ్లు
గడించాలని మాకూ ఉంటుంది కోట్లు
భరించక తప్పడం లేదెత్తుపోట్లు
ఏం చెప్పమంటారు మా పాట్లు
====================
యలమంచిలి వెంకటరమణ...✍😭

No comments:

Post a Comment