Friday, July 5, 2019

1781

1781
15/07/2018
తెలుగు రచన
====================
ఏ గ్రహణం పట్టిందో
ఏ కెరటం తాకిందో
కట్టుకున్న మేడలు
శిథిలమైపోయాయి
పెంచుకున్న ఆశలన్ని
నిషిదమై పోయాయి
కాన రాక దారి మనసు
వెల్లువల్లె పారుతుంది
నీవు తప్ప ఎవరులేని
ఏకాకిని ప్రియతమా
వీలైతే ఒక్కసారి
తెరిచి చూడు హృదయమా
కనుపాపలు తెరవనింక
కళ్ళల్లో దాచుకుంటా.
==================
యలమంచిలి వెంకటరమణ...ప్చ్

No comments:

Post a Comment