1812
తెలుగు రచన
23/12/2018
****************************
ఎక్కడనో పుట్టిస్తావు
ఎక్కడనో ముడివేస్తావు
ఇక్కడి మారాతలను అక్కడుండి రాస్తావు
బ్రహ్మయ్యా ...నీకే తగునయ్యా !!
తప్పురాసి నవ్వుకుంటావు
ఒప్పురాసి ఓర్వకుంటావు
ఇప్పుడే ఆశలెడతావు
గుట్టుగా కాలరాస్తావు
బ్రహ్మయ్యా ...నీకే తగునయ్యా !!
నిప్పుతో నీరుగాల్చటమూ
నీటితో నిప్పునార్పటమూ
గొప్పగా సృష్టి జేసావు
తిప్పలే నొక్కిరాసావు
బ్రహ్మయ్యా ...నీకే తగునయ్యా !!
మక్కువింత పెంచుతావు
రెక్కలు నువ్ తెంచుతావు
గుండెకింత వేదనిచ్చి
ఆగకుండా చేస్తావు
బ్రహ్మయ్యా ... నీకే తగునయ్యా !!
సృష్టికర్త నీవైతే
సృష్టికో లెక్కుంటే
ఒక్కమారు లెక్కలేసి
తప్పుదిద్ద జూడవయ్యా
బ్రహ్మయ్యా ...నీకే తగునయ్యా !!
****************************
.....య. వెంకటరమణ
No comments:
Post a Comment