1813
Telugu rachana
16/11/2018
======================
గొప్పోడెప్పుడు గొప్పలకోసం
ఎప్పుడు తీరని కోర్కెలదాహం
గుప్పెడుప్రాణం చిప్పుడుగంజి
తిప్పలుజూస్తే లత్తానులత్తల్
బోసిపోయినా కోటలు బోలెడు
మాసిపోయినా చరితల్ బోలెడు
తృప్తే ఎరుగని మనిషారాటం
సుఖమేఎరుగడు అయ్యోపాపం
మారరు జనము మారణహోమం
మమతలు జచ్చిన శవాలుమొత్తం
తిమింగలానికి చేపాహారం
పురుగుబుట్రా జేపల్ బ్రాప్తం
భువనం మ్రింగిన తీరనిదాహం
మనిషిన్ జేసిన దేవుడిలోపం
దేవుడికందని మనుషుల్లోకం
మితిమీరిందీ మనుషులపాపం
ఎందరొచ్చినా మహాపురుషులు
అందరుకందరు హింసలపాలు
యేసుకు సిలువా రామునికడవి
చేసిందెవరోయ్ మనుషులస్వార్థం
మభ్యపెట్టకు మానవత్వం
పాపం బెరిగితె తథ్యం పతనం
మంచిని బెంచే యత్నంచేద్దాం
మనుషులు మనిషిగ బ్రతకన్ జూద్దాం
=========================
యలమంచిలి వెంకటరమణ.........✍
No comments:
Post a Comment