1814
తెలుగు రచన
13/01/2019
==============================
జీవించడం తెలిసేసరికే సగజీవిత మయిపోతుంది
జీవితమంటే తెలిసేసరికే జీవితమయిపోతుంది
జీవించడమది కాదు కదా ఊహించడం
ఊహించని వేవేవో సాధించడమే జీవితము
సానబట్టే కొలదీ రాయి మెరయున్
మనము నడిచేకొద్దీ దవ్వు తరగున్
కష్టమేమీ కాదు సాఫల్యమే సుఖము
సఫలమైన బ్రతుకే సుఖప్రాప్తి పొందున్
కష్టమనుకొనిన మనము పుట్టుందుమా
నష్టమనుకొనిన నేడు బ్రతికుందుమా
బ్రతుకనేముంది లేవోయి బ్రతికిపోవచ్చు
బ్రతుకి జూపుము నీవు బ్రతికుండిపోవచ్చు
నడవబోయిన మనకు అలసటొచ్చును నిజము
పరుగుదీయగ మనకు ఆయాసమది నిక్కము
నిలచి ఉండుట నయమే నేనెట్లు కాదందు
అటుచూడు నీ నీడ తరగి నిన్నొదలి పోవున్
ఎవరికైనా తప్పదెదురు దెబ్బలు గాని
వెనుదిరిగబోమాకు మరుగవును గమ్యంబు
తానెరుగదా చేప ఎదురీత దుర్లభము
ఈదకుంటే కాదా,దాని బ్రతుకు ధ్వంసం
అనుకుంటే గనక సాధింపవచ్చు
సాఫల్యమయితే కష్టంబు గావచ్చు
నష్టమయితే కాదు బ్రతుకు మిత్రా
గెలుపు కళ్ళలోన మెరుపులెట్లా
సానబట్టిన రాయి వజ్రమయినట్లు
వజ్రమైన రాయి, విలువ పెరిగినట్లు
వజ్రమంటి నీవు మెరుపు మెరువు
మిరుమిట్లు గొలిపేటి విలువ పెరుగు
ఒక్క ఉదిటనెవడు ఉద్దండుడవలేదు
ఉద్దండులెవరయ్య నినుదాటి మరిలేరు
ఒక్క ఆకుతోనే వృక్షంబు పెరిగేను
పెరిగి వృక్షమదిగో నీడ పంచేను
ఊరకెటుల వచ్చె గుడిలోనికా రాయి
ఉలి దెబ్బలే గాచి దేవుడయ్యేనోయి
మంచిపేరు గాంచే ఆశ ఎవరికుండదు గానీ
జనులకైతే దెలుపు నీ పేరు ముందోయి
=========================
Yalamanchili Venkataramana
=========================
No comments:
Post a Comment