Friday, July 5, 2019

1815

భోగి పిడలు కరువై
ఇలా మండుతుంది
మాఇంట భోగిమంట
కావచ్చు మంట కొల్లుమంట
========================
బొబ్బెమ్మలేవో
గోడ గోపిడకలేవో
ఏవో ఆ గోవులేవో
ద్వారబంధమున
మామిడాకులేవో
ఏవో ఏవేవో
గుచ్చు కట్టిన
ఆ వరి గుత్తులేవో
గుంపు గట్టిన చిన్న
ఊర పిచ్చుకలేవో
అరటి  ఆకుల విస్తరేదో
ముద్దపప్పు మధ్య నెయ్యి
కొత్త అల్లుడి పంచలేవో
అరిసెలేవీ, పోకుండలేవో
మగ్గ బెట్టిన తేగలేవో
ఇంటి ముందర ముగ్గులేవి
గంగిరెద్దు మోపురాన
మువ్వ మ్రోతల గల గల్లులేవో
ఏవొ ఏవో ఆ రోజులేవో
========================
Yalamanchili Venkataramana
========================
ఎవరింటనో ఎదుకు
అవి ఏవీ మా ఇంటనే లేవు

No comments:

Post a Comment