1828
06/03/2019
Telugu Rachana
=========================
ఇంకెంత సమయం కావాలి
కలల లోకం నుండి బయటపడాలంటే
మనకింకా ఎంత సమయం కావాలి
ఎండమావి ఈ ఎడారిలో నీళ్లను గుర్తించాలంటే
మనకింకా ఎంత సమయం కావాలి
మబ్బులు కమ్మిన ఆకాశంలో
ఉజ్వల కాంతులు ఉదయంకై
ఇంకెంతని సమయం కావాలి
తీరం వెంబడి గువ్వరాళ్లలో
మెరుగు రాళ్లకై వెతుకులాటలో
గువ్వల్ మువ్వల్ పగిలిన చిప్పల్
పనికిమాలినా చెత్తకుప్పలు
రక్తం త్రాగిన గాజుల పెంకుల్
కొట్టుకుపోతూ మల్లెల శిఖలు
చిరిగిన రైకలు చెరగని మచ్చలు
చిలుము పట్టిన వేట కత్తులు
అక్కడక్కడా నక్క బొరియలు
అవిగో అవిగో తోడేలు గుంపులు
డంభంకోసం ఆలిచిప్పలు
ముత్యాలు మాయం మాయా లోకం
మెరుగు రాళ్లకై వెతుకులాటలో
మొరాయించినా మోకాలు చిప్పలు
కదలాలంటే ఇంకా కొంత సమయం కావాలి
తెల తెలవారే వెలుగుల కోసం
తెల్లరిపోయే బ్రతుకులు పాపం
నీడనిపించే మబ్బు ఛాయలు
వెలుగనిపించే పిడుగుబాటులు
అమాసలోన వెన్నెలకోసం
వేసారిపోయే జనాలు బోలేడు
ఉసస్సు ఎరుగని జనాల బ్రతుకులు
తెలవారాలంటే చాలా సమయం కావాలి
అది సమాప్తితోనే ఇక ముగియాలి
==========================
తెలుగు రచన
Friday, July 5, 2019
1828
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment