Friday, July 5, 2019

1827

1827
TELUGU RACHANA
03/02/2019
==================
చిగురుతొడిగిన కొమ్మలో
నేనాకునైనా కాకపోతిని
పరిమళించిన పూవులో
నొక రేఖనయినా కాకపోతి

తీపిగీతి కోకిలమ్మా పాటలో
ఆ రాగమన్నా కాకపోతిని
కాకపోతిని నేను కాదా
పుడమిపైనా పచ్చికయినా

ఆడిపాడే అలలలోనా
చినుకునైనా కాకపోతిని
కాకపోతిని అకట నేనూ
కొలనులోనా కలువనయినా

పవనమయినా కాకపోతిని
ఎగిరిపోదును గగనమందున
కాకపోతిని పున్నమయినా
వెన్నెలయి నే  విస్తరిందును

పుడమి పైనో పక్షినయినా
కాకపోతిని కణితినయినా
కొలనులోనో చేపనాయినా
కాకపోతిని కాకపోతిని
కవి చేతిలో నే కలమునయినా

ఆనందమంతా ఇచ్చటనుంచి
ఎందుకయ్యా నన్నచ్చటనుంచావు
బొంగరంలా తిరగమనుచు
బొత్తిగా నువ్ ఇలా వ్రాశావు
==================
.... యలమంచిలి వెంకటరమణ...✍🏻

No comments:

Post a Comment