Thursday, July 4, 2019

1829

1829
తెలుగు రచన
09/03/2019
=====================
ఏమో నాకేమితెలుసు
గడియపడిన గదిలోపలి
ఏమిజరుతుందో నాకేమి తెలుసు
నాకేమితెలుసు ఏమో నాకేమి తెలుసు

తెల్లవారే వెలుగులో కలిసిపోవలని
నిస్పృహతో ఎదురుచూసే
గది దీపాల కథలెన్నో నాకేమి తెలుసు

సిగ్గుతో మరి కళ్ళు మూసి
అంతలోనే ఆరిపోయి
రేపుకోసం ఎదురు చూడని
దివ్వెలెన్నో నాకేమి తెలుసు

ఏమో నాకేమి తెలుసు
అధిక ఉష్ణంలో  తాళలేని వేడిమిలో
మాడి పోయిన దీపాలెన్నో
ఆరిపోతున్న దీపాలెన్నో
నాకేం తెలుసు ఆ దీపాలెన్నో

మసక కన్నుతో ముసి ముసి నవ్వులతో
చిలిపిగా చూసి తృప్తిగా నిదరోయే
ఆ మధుర క్షణాలెన్నో
నాకేమి తెలుసు ఆ దీపాలెన్నో

ఆరిళ్ల పొరుతో
గోడగడియారం
ఘడియలు లెక్కేస్తూ
తెరవని హృదయం
తెరవేసిన గదిలా
ఉదయంకోసం ఉచ్వ్వాసతో
వేచిచూసే  ఆ దీపాలెన్నో
ఎన్నో ఎన్నెన్నో  ఇంకెన్నో
ఏమో నాకేమి తెలుసు అవి ఎన్నో
=====================
యలమంచిలి వెంకటరమణ

No comments:

Post a Comment