Thursday, July 4, 2019

పాకిస్థాన్ అవకాశవాదంగా ఉంటుంది

============================
పాకిస్థాన్  అవకాశవాదంగా ఉంటుంది
మనం మాత్రం చేసేదేమిటండి
ఇంటిలో అగ్గి రగులుతుంటే
పక్కింటివాడి పొయ్యారుపుతున్నామండి

సముద్రంలో నేవీ ఉంది
బోర్డర్లో  సైన్యం ఉంది
అడుగడుగునా సెక్యురిటి ఉంది
ఆకాశానికి చిల్లెక్కడుందండి

చెక్ పోస్టు దాటి చెక్కముక్క రాదు
టోల్ గేటు కాదని సైకిలన్నా పోదు
మిస్సైలయితే వాడు వెయ్యలేదు
మరీ విస్ఫోటమెలా అవుతుందండి

అడుగడుగునా ఆరాలే
కారు బెల్టుకు జురుమానాలే
ఎలకలన్నా దూరని ఇరకాటం
పందులు దూరొచ్చాయంటే వెటకారం

కాశ్మీరు సమస్య కాశ్మీరుకుంది
జనీవాలో సమాధానం వెతక్కండి
మాట్లాడవలసింది కాశ్మీరు జనంతో
మరి అమెరికావరకు ఎందుకండీ

అడిగి చూడండి ఏమంటారో కాశ్మీరు జనం
కడిగివేయండి చెత్త ఎంతుందో చూద్దాం
నన్నడిగితే అడ కత్తెరలో పోకచెక్క  పాపం

నువ్వు గాకపోతే వాడైనా నొక్కుతాడు ఖతం
============================
తెలుగు రచన

No comments:

Post a Comment