==============
కదంకదం, కదం కలిపి
ప్రగతి పదం, నడక సాగుమా
పదం స్వరం, విధం నీది
భరత కీర్తి పాట పాడుమా
మువ్వన్నె చిహ్నమనీ
మురి పాల దేశమని
ఇది మా దేశమనీ
ఇదే మాకు స్వర్గమనీ
భరత కీర్తి పాట పాడుమా
పదం, స్వరం,విధం నీది
భరత కీర్తి పాట పాడుమా
చిన్నచిన్న తగాదాలు,
చిన్నవైన విభేదాలూ
చెల్లునులే మాకుమాకు
శత్రుక్షేపమొన్నటికి చెల్లనీమని
మన సత్తా చాటి పాడుమా
పదం, స్వరం,విధం నీది
భరత కీర్తి పాట పాడుమా
యూఎస్సైనా -యూరఫ్ఫైనా
మేధస్సులో - మెహనత్తులో
ప్రధమపధం – ప్రగతిపదం
మనది పాడుమా
భారత కీర్తి పాట పాడుమా
పదం, స్వరం,విధం నీది
భరత కీర్తి పాట పాడుమా
కదం, కదం, కదం కలిపి
ప్రగతి, పదం, నడక సాగుమా
పదం, స్వరం, విధం నీది
భరత కీర్తి పాట పాడుమా
================
తెలుగు రచన
యలమంచిలి వెంకటరమణ
(గంటి : కొత్తపేట)
No comments:
Post a Comment