గుడి గుడికో గోశాలను కట్టిద్దాం
గోమాతలకావాసం కల్పిద్దాం
ఉద్యమంలా సమర్దిద్దాం
======================
ఏ జెండాకైనా అజెండాలారాటం
పొట్టకోసమే కదా ఈ ఆర్బాటం
బాగానే పేలిందీమధ్యనో విస్పోటం
గోవధ నిర్మూలన అకటట్టహాసం
జీవకోటిపై మనిషికుంది అధికారం
కాపాడే వాటికి మనిషేగా ప్రత్యక్షదైవం
ఎవరు కాదంటారు జీవహింస మహా పాపం
వాటిని కాపాడుట మనందరి కర్తవ్యం
పటిష్టంగా చట్టాలంటే చేయిస్తాం
గట్టి శాసనాలు గడ్డి పెడతాయా నేస్తం?
విషమస్తితిలో గోమాతలున్నాయది వాస్తవం
వధించేవాళ్ళేమో గానీ చిత్రవధలో అవి నిజం
నడి రోడ్డే ఆవాసం, కాగితాలు ఆహారం
నీళ్ళకన్న నోచుకోక వేలల్లో కాలగతం
తినే వాళ్ళనంటే ఖచ్చితంగ ఆపేస్తాం
తినడాని కెవరేసును గోవుకింత గ్రాసం
పొద్దున్నే హారతిచ్చి, నుడుటినింత బొట్టుపెట్టి
ఫలహారం నోటబెట్టి, నడిరోడ్డున వదిలిపెడితే
అదే పుణ్యమనుకుంటే,అవుతుందా పుణ్యం
అవునా అది పుణ్యం, వాటికేది గత్యంతరం
పరిగెట్టే గుర్రానికి పెట్టరిన్ని గుగ్గీల్లు
వట్టిపోయినావుకు ఎక్కడమ్మ వేస్తారు
కనీ పెంచినమ్మకే కాలుతుంది గాచ్చారం
పాలిచ్చిన గోమాతకు వేస్తారా గ్రాసము
కోరలున్న పులుల్ని కట్టి పెంచు యత్రాంగం
గోమాతలకివ్వరెంటి ఇంతైనా ప్రాధాన్యం
పైనంతా పటారం,లో లోపల లొటారం
పరికించని ఈ జనం పడిపోతారిదో ఘోరం
పూజప్పుడు దన్నమెట్టి,దేవతనుట వాస్తవం
పడి మేస్తే వాటిని తరుముతాము కదా మనం
దేవాదాయ భూములు దేవుడివని అంటాము
ఈ దేవత మేయబోతే ఎందుకయ్యా తరుముతాము
మేలుగాని వాటిని ఎవరమైన అమ్ముతాం
అమ్మువారి అవస్థ వారినుండే గ్రహిస్తాం
తినే వాడ్ని ఆపడం కాదయ్యా సఫలము
అమ్మకుండ చుడాలి అదికదా అవశ్యం
గుడి గుడికో గోశాలను కట్టిద్దాం
గుడి పైకం గోవులకై వెచ్చిద్దాం
లేవలేని వాటిని ఆడ తెచ్చి పెంచుదాం
గోమాతలు మనదైవం,కాపాడుట మన ధర్మం !!
=================================
తెలుగు రచన వెంకటరమణ/..
No comments:
Post a Comment