Friday, July 5, 2019

1831

1831
TELUGU RACHANA
10/03/2019
==================================
మనం ప్రేమించుకుందామా
ప్రేమే కదా మనం పంచుకుందామా
మనమే మనకోసం పెంచుకుందామా
మన సంకెళ్లు మనమే తెంచుకుందామా

కులాలూ, మతాలూ, జాతి బేధాలు
కలహాలు, కుట్రలు, ఈ కల్లోలాములు
తెగని కంచెలు, తెల్లారని బ్రతుకులు
తెంచుకుందామా మనం ప్రేమించుకుందామా

చలనం లేని చెట్లూ, చెప్పలేని పక్షులు
నోరులేని జంతువులూ,పాలిచ్చే పశువులు
సంతోషంగా కలిసుంటుంటే
మనకెందుకు ఈ విభేదాలు
మనం ప్రేమించుకుందామా

వీచే గాలి, గాచే ఎండ, ప్రవహించు నీరు
క్రిందీనేలా పైనాకాశం వేటికీ లేని ఈ వైరాలు
నీకూ నాకూ ఎందుకులే ప్రేమించుకుందామా
ప్రేమే కదా మనం పంచుకుందామా

వివేకానందుడు, రామ కృష్ణుడు
కలియుగ దైవం వెంకటేశుడు
రాముడు కృష్ణుడు చివరికి సాయి
ఎవరూ ఈ బేధాలు ఎందుకు
మనమెందుకు మనం ప్రేమించుకుందామా

మాదిగ పేటలు, మాల పల్లెలు
అగ్రహారం, ఐదో వర్ణం అన్నీ పక్కన పెడదామా
కలిసిగట్టుగా మనముందామా
మనం మనం ప్రేమించుకుందామా

కులాల వర్గం వదిలేద్దామా
మతాల గొడవలు మానేద్దామా
అందరమొకటై  బ్రతికేద్దామా
ఆనందంగా మనముందామా

మనం ప్రేమించుకుందామా
ప్రేమే కదా మనం పంచుకుందామా
మనమే మనకోసం పెంచుకుందామా
మన సంకెళ్ళు మనమే తెంచుకుందామా
==================================
     యలమంచిలి వెంకటరమణ

No comments:

Post a Comment