Friday, July 5, 2019

1835

1835
తెలుగు రచన
--/--/2019
================
అంతలోనే ఏడుపందువు
అంతలోనే నవ్వుకొందువు
ఎంత పిచ్చి నీకు నా మనసా
నీకెంత పిచ్చే పిచ్చి నా మనసా

నాది నాదని వాదమాడి
ఏది లేకా వెడలిపోతువు
ఎంత పిచ్చే నీకు నా మనసా
నీకెంత పిచ్చే పిచ్చి నా మనసా

భార్య భర్తని, భర్తభార్యని
తల్లిపిల్లలు,పిల్లతల్లులు
ఎంతవరకీ బంధమే మనసా
కడకుతోడు నీకుఎవరే పిచ్చి నమనసా

పరులు పరులవి వేరుజేద్దువు
తన దైనదేదో మరిచిపోదువు
సాగనంపే దెవరు నా మనసా
ఒంటరే నువ్ కడకు ఓ మనసా

ఎండలుంటే వానలందువు
వానలుంటే ఎండాలందువు
గెంజి దొరికితే అన్నమందువు
అన్నముంటే పరమాన్నమందువు

త్రుప్తినెరుగని త్రుష్టమై నువ్
తనకలాడుతు బ్రతుకుతావు
తలవాపులేలా తగ్గు నమనసా
తనువుముగిసాకేమిలేదు తగ్గువేమనసా

ఎంతకాలం ఉండబోదువు
ఎన్ని నాళ్ళని నా వెంట ఉందువు
ఉండనీవే సుఖము గామనసా
నన్నుండనీవే సుఖము గామనసా
=====================
       యలమంచిలి వెంకటరమణ

No comments:

Post a Comment