Friday, July 5, 2019

1839

1839
తెలుగు రచన కృతి
16/06/2019
======================
పధ్యమెటులా వ్రాయుగలను
నీనామమే దప్పేమిదెలియదు రామా
గేయమెటులా  పాడగలను
నీమంత్రమొకటే తెలియునో రామా

నాకేమిదెలియును నిన్నుగొలువ దప్పనోరామా
శరణుగోరి వచ్చాను  చారణమొకటే తెలియు నోరామా
తెలుసు నొక్కటేనాకు నిన్ను గొలువ నోరామా
శరణువేడితి ఆదుకొనుమో ఆజానబాహువు రామరామా

కీర్తనయినా నాకురాదు కీర్తింతునెటులో దశరదేయా
కృతులుకుడా రావునాకు లాలించనెటులా కీర్తిదామా
గుడులనెటులా కట్టిగలను రమణనయ్యా నేనురామా
తెలుగురచన రమణ నేను ఏకబాణం రాజారామా

ఉడుతనైనాకాకబోతిని మునివేళ్ళకైనా నోచుకుందును నేనురామా
లంకనైనా పుట్టకయితిని  సీతమ్మ సేవలు చేసుకుందును
సరాయునైనా గాకపోతిని  చరణస్పర్శకు నోచుకుందును
మిలినమైతిని మనిషినైతిని మన్నించుమోయి మహాపురుషా

పరముమరచితి ఇహమునొంది  పతితపావన  రామచంద్రా
ధరణిధన్యము నిన్నుఁబొంది పదధూళిచాలును పరందామా
ప్రణతింతునయ్యా పాపహారా
పరముమరచితి ఇహమునొంది  పతితపావన  రామచంద్రా
ధరణిధన్యము నిన్నుఁబొంది పదధూళిచాలును పరందామా
ప్రణతింతునయ్యా పాపహారా
రామా.............రామా.... రఘురామా
======================
యలమంచిలి వెంకటరమణ

No comments:

Post a Comment