Friday, July 5, 2019

1840

1840
తెలుగు రచన
17/06/2019
======================
మానవత్వం మ్రానులయ్యి మాడిపోతుంటే
నీరుపోసే దాతలేక వాడిపోతుంటే
వనపక్షులన్నీ వెక్కిరిస్తూ వదలిపోతుంటే
వనముఎట్లవి రుద్రభూమికి సాటికాదేమి

రోజురోజుకు రక్కసత్వం ప్రబలమవుతుంటే
కరణసైతం కాలగతమున సమసిపోతుంటే
కర్కశంగా జనంపైకి జనం వస్తుంటే
నవ్విపోరా మహాకాయులు ఎక్కడున్నారో

ఖర్మభూమని కథలుచాలు కలసిరండి
మనిషిలో ఒకబీజమేసి వనముగాయండి
పాపపుణ్యం కాస్తనేర్పి మొక్కలేయండి
మనిషిగా మనంఉందాం ముందుముందండి
======================
యలమంచిలి వెంకటరమణ

No comments:

Post a Comment