======= నాన్నా నీవెక్కడ ?? =======
యువతలారా!మిత్రులారా!!
భారతమాత పుత్రులారా
చరిత జెప్పజాలదోయి,
భారతజాతి మనదిభాయి.
ఉట్టుగట్టి మోసినట్టి
శ్రవణుడీడ బుట్టెనోయి
కష్టపడీ పెంచినట్టి
ముసలి తల్లిదండ్రులన్ను
విడిచిపెట్టి ఉరకదీయ
తగదుమీకు తగదుమీకు
యువతలారా మిత్రులారా
భారతమాత పుత్రులారా
అడగకనే జన్మనిచ్చి
అడుగునపడి పైకి తెచ్చి
అడుగడుగున తోడుండి,
మరుగునపడి వెలుగునిచ్చు
మహిబ్రహ్మా రూపాలు
మన అమ్మా-నాన్నలు
అంతకంత గింతజేయ
అంకితమే అయ్యిరింత
అంతజేసి వింతకదా
పంచ నింత చోటులేక
తోడుండే బిడ్డ కలలు,
తోడు గోరివేరుజేయ
వంచనెంతొ జెప్పలేక,
పంచుకునే దిక్కులేక
రక్తమంత రంగరించి
మమకారం వెన్నరాక
పరారైన బిడ్డలకు
స్వరాలేమి పంచలేక
నరాలేమి తోడురాక,
తమ కలలేజేరకైన
దారిలేని ముసలితనం
దారుణమది తెలుసుగా.
ధరణి పంచజాలవులే,
వరాలేమి గోరరులే.
ఓ పరి నిటు మరికించుము
నిన్ను గన్న వారు వీరు.
మీకొరకై ఎండివారు
వట్టి కట్టెలయ్యినారు
యువతలారా మిత్రులారా
భారతమాత పుత్రులారా
విడిచిపెట్టి ఉరకదీయ
తగదుమీకు తగదుమీకు !!
....................................య.వెంకటరమణ
No comments:
Post a Comment