Thursday, July 4, 2019

వాన జల్లు విడిచి చిరు సూర్య కిరణాలు

==========================
వాన జల్లు విడిచి  చిరు సూర్య కిరణాలు
కురులంటి తానాల పూదోట గమనములు
ముత్యమల్లే చూడు మేను పైన చినుకు,
తామరాకు సొగసు.తన్మయము మనసు
కారు మబ్బులు తొలగి శుచిభూర్తి  గగనమ్ము
వీర విల్లువోలె వలస పక్షులవిగో బారుదీరి
అందమంతా చేరి అరవిరిసెనే నేల
అణువణువు పులకించె నా మనసు నీ వేళా!!
=============================
                       తెలుగు రచన
           యలమంచిలి వెంకటరమణ

No comments:

Post a Comment