Thursday, July 4, 2019

మా ఊర్లో ఏటిగట్టు

==========================
పరాచకం కాదు ఇది అక్షరాలా నిజమండోయ్
==========================
మా ఊర్లో ఏటిగట్టు
ఆ పక్కనే కాలవ గట్టు
దాన్నంటుకునో సారా కొట్టు
వాడి పేరేమిటో పక్కనెట్టు

వాడికి పుట్టాడు ఒక కొడుకు
పెట్టారు పేరు అన్నీ కలిపేసినట్టు
ఎంత కుదించి వ్రాద్దామన్నా
ఏ బీ సీ డీలు చాలవన్నట్టు

ఎద్దులా పెరిగాడు గానా అబ్బాయి
చదువబ్బక  అయ్యాడు మొద్దోయి
దౌర్జన్యాలకు ముందుంటాడాయే
అందుకేనేమో రాజకీయాల్లో చేరాడోయి

బాగా పోయించాడు,  తాగుడు
మత్తులో చూపించారు,దూకుడు
వాడయ్యాడు మాకు  నాయకుడు
బాగా రాటు దేలిపోయా డిప్పుడు

ఈ మధ్యనే ఓ ఇల్లు కట్టించాడు
కోట్ల డబ్బు  దానికే  పెట్టేసాడు
మళ్ళీ చెల్లెలికి పెళ్లి చేసాడు
పెళ్ళాన్నీ ముగ్గులోకి దింపేసాడు
ఊర్లమీద పడి  వీడుంటాడు

జనం ఉమ్మేస్తుంటే బాగానే తుడుచుకుంటున్నాడు
ఏమన్నా  అనబోతే  ఇదిగో ఇలా  అంటున్నాడు
“ ఊరకనే  వేసారా  మీరు  ఓటు
నేను పోస్తుంటే తాగారుగా నాటు
ఉత్తూరుకునే రాలేదీ సీటు
ఇంటోళ్ళని పెట్టాను తాకట్టు”
వాడన్నది అక్షరాలా కరక్టు
ఇస్తారంట వీడికీ మంత్రి సీటు

ఇలా ఉంది జనమ్మీద మార్కెట్టు
పోసేది తాగడం కట్టిపెట్టు
నిజమైన నాయకుడ్ని గుర్తుపట్టు
లేదంటే ఇదే ఇంక పరిపాటు !

                                       య.వెంకటరమణ

No comments:

Post a Comment