==================
గూళినై నేను ఎగిరి పోవాలి
మేఘమే నను గప్పివేయాలి
తారనై నే నుండి పోవాలి
శక్యమైతే నేనిలా ఉండాలి
అడవి కొమ్మన కోయిలై నేను
మధుర గీతం ఆలపించాలి
అలను నేనై పొంగిపోవాలి
శక్యమైతే నేనిలా ఉండాలి
నెమలినై నే నాడుకోవాలి
కళ్ళు తెరిచిన లేడిపిల్లగ నేను
చెంగు చెంగున గంతులేయాలి
శక్యమైతే నేనిలా ఉండాలి
మొగ్గనై విరిసి నే నవ్వుకోవాలి
గాలి అలనై నే నూయలూగాలి
వెన్నెలై నేను వెలుగునీయాలి
శక్యమైతే నేనిలా ఉండాలి
పించమై నే నెగిరిపోవాలి
అంత కంతకు నింగి చేరాలి
మేఘమై నే నేలరాలాలి
నవ్వుకోనీయ్ నేలనైతే చల్లగుంచాలి
====================
తెలుగు రచన
యలమంచిలి వెంకటరమణ
No comments:
Post a Comment