============================
గమత్తురా ఈ, జగత్తురా
మోసగాళ్ల జగత్తును నమ్మబోకురా
నమ్మదగిన దొక్కటేర అమ్మప్రేమ
అమ్మా నాన్నా నీ దైవం మొక్కి చూడరా
నిన్న చూడు ఫకీరు
మొన్న చూడు లుటేరు
నేడు నీకు దేవుడేట్లురా
నమ్మి నీవు వమ్ముగాకురా
నమ్ముతారు దేవుడని,
వాడమ్ముతాడు దేవుడిని
అంచనాలు వేసి చూడరా
వంచ నేల మించి బ్రతకారా
ఎవడికాడి కిదో వ్యాపారం
పెట్టుబడి మూఢనమ్మకం
నిన్ను నీవు తట్టి చుడుమో
మేలు జేయ మొక్కు జేయమో
గమత్తురా ఈ, జగత్తురా
మోసగాళ్ల జగత్తును నమ్మబోకురా
నమ్మదగిన దొక్కటేర అమ్మప్రేమ
అమ్మా నాన్నా నీ దైవం మొక్కి చుడరా
==========================
తెలుగు రచన
యలమంచిలి వెంకటరమణ
No comments:
Post a Comment