Thursday, July 4, 2019

నిద్ర లేవు, మత్తు వదులు

=================
నిద్ర లేవు, మత్తు వదులు
నీ శక్తిని నువ్వు ఎరుగు
నీటిపైన నడవ గలవు
గాలిలోన ఎగుర గలవు

చట్టానపు కొండలను
చిత్తు చిత్తు చేయగలవు
క్రూరమృగం కోరలిరిచి
కాపుగ నీకుంచగలవు

అనుకుంటే చాలు నీవు
అనుకున్నది చేయగలవు
మనిషి నీవు మనిషి నీవు
మర మనిషివి కాదు నీవు

బ్రహ్మ దేవుడేమో మరి
తనను బొలి నిన్ను జేసే
ఉన్నదేమో తెలీదోయి
తన శక్తినెంతొ నీకనిచ్చె

నిద్ర లేవు , మత్తు విడువు
నీ శక్తిని నువ్వు ఎరిగి
విజయ పథం సాగు నీవు
అసాధ్య మేదీ కాదు నీకు

వెలుగు జూపు దివ్వె నీవు
ఆర్పివేయు పురుగు నీవు
బ్రతుకునిచ్చి బ్రతికి చూడు
పరమాత్ముడు నీలో నీవు

నీ విశ్వాసం నువ్వు విడిచి
బాబాలనీ మొక్కబడి
దగా పడుట తగదు నీకు
నీ దైవత్వం నిద్ర లేపుమోయ్

నిద్ర లేవు, మత్తు వదులు
నీ శక్తిని నువ్వు ఎరుగు
నీటిపైన నడవ గలవు
గాలిలోన ఎగుర గలవు
చట్టానపు కొండలను
చిత్తు చిత్తు చేయగలవు
===============

         తెలుగు రచన
యలమంచిలి వెంకటరమణ

No comments:

Post a Comment