Thursday, July 4, 2019

చావు నీ ఇంట్లో విషాదం నా ఇంట్లో

============================
చావు నీ ఇంట్లో విషాదం నా ఇంట్లో
బ్రతుకు తనదైతే ఏడ్పు మీ కంట్లో
పుట్టి ఏడుస్తుంటే జనం నవ్వేమిటో
అలిసి నిద్రిస్తుంటే జనం ఏడుపేమిటో
రాజుగారు మరణిస్తే రాజఘాట్ కి
భద్రమ్మో భద్రయ్యో మోసేయ్ రా గోదా రొడ్డుకి
సంపాదన లేనోడు ఏది చెప్పినా సోదు
సంపాదించే నానిగాడు సెప్పిందే వేదం చూడు
అనుకుంటాం గాని, అమ్మేమి తక్కువ తింది
మక్కువగా పెంచింది పెద్దోడిని
మొక్కొచ్చే సరికి గోకుడు గుండు చిన్నోడికి
నాన్న ఎవడికి మాత్రం నచ్చేడు
చెమటకు నానీ నానీ పాపం నచ్చడు
ఈ పుట్టుడేందో, చచ్చుడేందో దేవుడా
పుట్టేదాకా అమ్మను సంపుడు,
సచ్చేదాకా వీడు సచ్చుడు
ఈ పుట్టుడేందో , చచ్చుడేందో దేవుడా
=============================

No comments:

Post a Comment