===============================
మషీదు బాగానే కట్టించాం,
ప్రేమనొక్కటే మేఁ మరిచాం.
రామాలయమును సాధించాం,
రాముడినయ్యో వదిలేశాం
పృద్విని మొత్తం చుట్టేసాం,
తారా గ్రహములు చూసేసాం.
లక్ష్యం దాటే సాధించాం,
మానవత్వమే కోల్పోయాం.
మత ద్వేషాలు మళ్లీ మొదలు,
కాజి,పూజారి బాగున్నారు.
మతాలు భద్రం, మనకే క్షవరం,
మనలో,మనమే కొట్టుకు చచ్చాం.
విభేదాలు ఎప్పుడు తలెత్తినా ఇంతే,
తుదకు మనమే నష్టపోతుంటాం.
చూడు, విభేదంలో,
పాకిస్థాన్ని మనం నష్టపోయాం,మనల్ని పాకిస్థాన్ .
==================================
తెలుగు రచన
యలమంచిలి వెంకటరమణ
Thursday, July 4, 2019
మషీదు బాగానే కట్టించాం, ప్రేమనొక్కటే మేఁ మరిచాం.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment