నేనే! ఆ నేనే !
=================
బాపూ చెప్పిన పౌరుడ్ని నేనే.
అగ్గై రగిలే ఈ నిప్పూ నేనే.
వెలుగులు చిందే ఆ దివ్వెన్నేనే.
భవితను దిద్దే కలాన్ని నేనె
మీ లక్ష్యం నేనే.
మీరెతికే ఆ వెలుగున్నేనే.
నాకూ ఓ రోజొస్తుంది.
నను కాల్చే ఈ నిప్పులతో లోకానికి వెలుగులు చూపిస్తా. నాకా అవకాశం మీరిస్తే నా సత్తా నే చూపిస్తా
నేనెవరో మరి గుర్తిస్తే, ఆ గుర్తింపుకు నే గురుతౌతా!
ఆ చీకటిలో నన్నదిమేస్తే వెలుగుకు నే కరువౌతా!
==================
య. వెంకటరమణ ( తెలుగు రచన)
No comments:
Post a Comment