Thursday, July 4, 2019

హస్యానికే నుమీ

హస్యానికే నుమీ
======================
జీవినపయనంలో  ఎత్తుపల్లాలొచ్చి పోతూ ఉంటాయ్
పరిస్థితుల్ బట్టి ఉద్దేశాలు మారుతుంటాయి
ఆఫీసులో నిదరోకూడదని నేనూ అనుకుంటాను .
చాలీచాలనీ జీతాల్ జూసది మరిచిపోతుంటాను

కష్టాలు అందరికీ వస్తాయి, పంచుకుంటే తగ్గుతుంటాయి
అందుకేనేమో ఒక కూతురు ఒక కొడుకు కావాలనుకుంటారు
పంపకంలో బాగుంటుందని ఎవరికారే అనుకుంటారు
కూతుర్లను కనుకున్నవారు బాగా నయ్యమ్
కష్టాల్ పంచిస్తారు, సుఖాల్ తెచ్చుకుంటారు

అందులో మా మామగారేం తక్కువలేండి
సాటి మగాడని కొంచెమైనా చూడలేదు
చేసిన ద్రోహం కాళ్ళు కడిగేస్తే పోతుందాఏంటి
ఆయనంటే సరేపాపం పెళ్ళికొచ్చి మీరంతామాత్రమేమి జేశారు?
నేను మునిగిపోతుంటే వచ్చిపండగ చేసుకున్నారు

అమాయకుడు అమాయకుడు అంటుంటే ఏంటో అనుకున్నా
ఆ అమ్మాయికి కుడిప్రక్కన కూర్చోమంటే గౌరవమనుకున్నా
కోకనడా కాకినాడైనట్టే ఓరుగల్లు వరంగల్లయినట్టే
అమ్మాయి కుడు అమాయకుడయినట్టుంది
జీవినపయనంలో  ఎత్తుపల్లాలొచ్చి పోతూ ఉంటాయ్
పరిస్థితుల్ బట్టి ఉద్దేశాలు మారుతుంటాయి
======================
                                                        తెలుగు రచన

No comments:

Post a Comment