Thursday, July 4, 2019

నీ నడుమున నీళ్ల కడవ

=================
నీ నడుమున నీళ్ల కడవ
కడవ చుట్టి ఎడమ చేయి
ఎడబాయని ఎద లోగిలి
ఏదో ఏదో మదిని కలవరం

హంస నడక అందెల తాళం
జడగంటల జమా జమారం
నీ కొప్పే నీకు సింగారం
మేను రంగు మేలిమి బంగారం

నీరు గారి పోతుందీ కడవ చూడవే
ఏడ ఏడ తాకనుందొ దాన్ని ఆపవే
ఒక్క చుక్క నేనైనా ఎక్కడెక్క డుందునో
చక్కగా కడవనైన అక్కడన్న ఉందునే

మొక్కుకన్న చూడవే మీనాక్షీ
పక్కనింత చోటు చాలు కామాక్షి
పైన చంద్రమామనెలా కాపుగాయనే
కింద కాలు కంద కుండా పూలు పరవనే

నీ నడుమున నీళ్ల కడవ
కడవ చుట్టి ఎడమ చేయి
ఎడబాయని ఎద లోగిలి
ఏదో ఏదో మదికి కలవరం
================
          తెలుగు రచన
యలమంచిలి వెంకటరమణ

No comments:

Post a Comment