💝💝💝💝💝 సువేష రసిక 💝💝💝💝💝
==============================
నెమలి పించముల మెరుపు కురులదీరు.
మోవి,కమల రేకుల వెలుగు దోసాని పూలు.
మేను కౌశేయమేమో,నునుపు చేజారు వాలు.
వెన్నముద్దల వన్నె, దిగ్గు డెరుగని వాలు.
తూకమేసిన తూలి దొంతర్లవాలు,వెనకమాలు
నడక నాట్య లయలు, నర్తకేమో నీమె.
వీరవిల్లును మీరి నడుమొంకు నాట్యాలు.
వీణ మీటిన తీరు,వినగోరు ముమ్మారు,
పలుకు తీరున పేరు 'మధుబాషి' కాబోలు.
వింత గొలిపే దివ్య మొకటేమి అణువణువు
దివ్యకన్యనేమో! కదలి ఇల కిటుల నేతించె.
యేమో,యేమోనేమో,బ్రహ్మసృష్టి కీమె మేలి మచ్చు.
ప్రాణంబు గైకొనిన పసిడిశిల్పమీమె గానవచ్చు.
ఎల్ల రాజ్యములు గెలిచి నెలుగు రారాజు సైతంబు,
నిర్గ్రంథుడే నకట,గెలవలేక నిన్ను ఇల మేలి నాతీ.
■■■■■■■■■■■■■■■■
============================
అర్ధాలు:౼
పించముల = ఈకలు
కురులు = వెంట్రుకలు
కౌశేయము= silk
మోవి= పెదవులు
దోసాని పూలు= ఒక రకమైన ఎర్రనిపూలు
దిగ్గు డెరుగని = వాలిపోని,
తూలి= మెత్తనైన పక్షి ఈకలు
మధుబాషి=తేనెవలే మాట్లాడేది
దివ్య కన్య = దేవ కన్య
మేలి మచ్చు= మంచి నమూనా
నిర్గ్రంథుడు= పేదవాడు
తెలుగు రచన
యలమంచిలి వెంకటరమణ
No comments:
Post a Comment