**********************************
హరా భరిత అవని అందాల సీమ
ఉదయ కాంతుల వెలుగు శాంతి సీమ
అంద చందాల సీమ ఈ పల్లె సీమ
మలిన మెరుగని మా పల్లె లేమ మనసు
పడతి కొప్పున జేరి పలకరించెడి పూలు
నడుము చుట్టిన కొంగు నాతి హొయలు
ముంత గట్టిన ఎంకి ముంజేతి అందాలు
మట్టి గాజుల చేయి, మెట్టు, పట్టీలు
ఎర్రబారిన పళ్ళు ఏరేరి చిలకల్లు
ఏరు వాగును జేరి ఎన్నెన్ని పుష్పాలు
యాస ప్రాసలు కూర్చి జనపదుల గీతాలు
పొద్దు గూకే వాలు పిడక తాపిన పాలు
పేడగలిపిన నీళ్లు అందాల వాకిళ్ళు
తడక కేసిన చీర తానాల గలగల్లు
సన్నజాజులు తురిమె సయ్యనెడి సైగల్లే
మల్లె పందిరి సొగసు,పైన వెన్నెల్లు
సందకాడే జూడు సద్దు మణిగిన ఊరు
సందు కోసం మామ దొంగ వేషాలు
ఊపిరాడని బిగువు, ఊసులాడే సెగలు
ఉరకలేసే మనసు నుయ్యాల జంపాలు
కోర మీసం జోరు, పట్టమంచం గోడు
పట్టు విడువని మామ కేవి పగ్గాలు
కందబారిన మోము సిగ్గుదొంతర్లు
అందమైన సీమ మా పల్లెఅందాలు!!
********************************
తెలుగు రచన
యలమంచిలి వెంకటరమణ
.
No comments:
Post a Comment