14/02/2019
===================
చెలామణీ స్వలాభానికి ఇదియొక పథకమో
చెల్లని నూకలు చెల్లించుకునే యత్నమో
మానవ జాతి రక్కస వికృత రూపమో
ఇదినా తల్లిభారతి గర్బఘోసా శాపమో
ఇదినా తల్లిభారతి గర్బఘోసా శాపమో
దుష్టులకు జన్మనిచ్చి రోధించే ఆ తల్లి శోకమో
ఏమో ఇది ఆ తల్లి రక్త కన్నీరే కావచ్చునేమో
రక్తలిప్తులైన తన బిడ్డలన్ జూసిన వేదనేమో
ఇలస్వర్గంలో కోమల కుసుమాలు సైతం
లిప్తమైన రక్తంతో విలపిస్తున్నాయేమో
రక్కసి విస్ఫోటానికి మలయ పంక్తులు సైతం
గుండె పగిలి రోధింస్తు న్నాయేమో
బిడ్డ రాకకై ఎదురు చూసినా తల్లికి
ఏమని చెప్పాలో ఏమో
తండ్రి రాకకై తల్లడిల్లినా బిడ్డల
నేమని ఓదార్చాలో ఏమో
ఏమని ఓదార్చాలో ఏమో
పడిగాపుల పెనిమిటి కోసం
పసుపైనా ఆరని ఆ ముత్తైదువుల
నేమని ఓదార్చాలో ఏమో
ఈ రక్కస కాఠిన్యాలకు అంతంలేదంతేనా
ఇంకానా, మనమింకా బలికావలసిందేనా
నాయకులంతా నాలాయకులేనా
నేలకొరుగునది ఈ జవానులంతేనా
దేశం నిద్దురలోనే ఉందింకా
మీరూ నిదురొండికనైనా వీరా
కాపుగాచి మీ కన్ను లెండిబోయేనేమో
నా కన్నీళ్లను మీకిస్తా నిదురొండిక నిదరొం డయ్యా
===================
వీరగతి ప్రాప్తులైన జవానులకు దగ్ధ బోయిన స్వరంతో జేజేలు
చమ్మగిల్లిన కన్నులతో నివాళులు
తెలుగు రచన
=========
No comments:
Post a Comment