క్షమా గుణానికి పుట్టినిల్లు భారత్
దయాగుణం ఇంటిపేరు భారత్
సహనంతో సాటిలేనిది భారత్
యుద్దబలగం ఎంతుందని
ఎవరైనా మిమ్మల్ని అడిగితే
చెప్పండి, 130 వందల కోట్లని,
ఇక్కడ పౌరులెవరూ లేరని
ఇక్కడందరూ వీరులుంటారని
మాకు పిరంగులతో పనిలేదు
పిడికిలి తో మసి చేసేస్తామని
పిరికితనం మీదైతే దయాగుణం మాదని
వీరుల్ని గన్న మా తల్లి భారతి
ఒక్క వీరుడ్ని కోల్పోయినా
విల విలలాడిపోతుందని
మా తల్లి సంకెళ్లు తెంచడంకోసం
నవ్వుతూ ప్రాణాలిచ్చిన దేశమని
ఇచ్చిన మాటకోసం అడవులపాలైన
దశరథ రాముని దేశమిదని
ఒక్క వీరుడికోసం కూడా
మేము అంతే చేస్తాం అదే మా దేశమని
వంద తప్పులు చిరునవ్వుతో సహించిన
పరందాముని దామ మిదియనీ
చేతకాని తనం కాదు
ఒక్కడికోసం అందరమైతే
అందరికోసం ఒక్కడు మేమని
ఏమైనా జరగవచ్చు ఉదృక్తం కావద్దు
మనల్ని మనమెపుడూ మరవొద్దు
No comments:
Post a Comment