Friday, July 5, 2019

1784

1784
తెలుగు రచన
17/07/2018
===============
పిలవకుండా వచ్చాము
చెప్పకుండా పోతాము
తప్పకుండా పోతాము
ఉండమన్నా ఉండలేము

ఏడుస్తూ మనమొస్తాము
ఏడిపించి వెళి పోతాము
మధ్య నున్నదే జీవితము
జీవితమే ఒక నాటకము

ఎవరు ఎవరికెవరూ కారు
ఎవరి కొఱకు ఎవరూ రారు
కాటికాపారెవరో ఎరుగము
అతనే చూడు చివరి నేస్తము

ఎవరు వేసినా చెట్టొ ఏమో
చివరి పానుపు నీదవుతోంది
ఎవరు కట్టునో ఏమో పాడి
చివరి పల్లకీ నీదవుతోంది

నిన్నొదిలసలే ఉండని వారే
చనిపోతే నిను శవమంటారూ
చనిపోతే నిను శవమంటారు,
దరజేరంగా భయమంటారు

ఎవరూ ఎవరికి ఎవరూ గారు
చివరికి ఎవరూ నీతో రారు
ఉన్నన్నాళ్లే నీదీ నాదీ
పోయాకందరి దొకటే ఊరు!
=================
యలమంచిలి వెంకటరమణ....✍

No comments:

Post a Comment