1786
తెలుగు రచన
17/07/2017
======================
నిన్నలా లేదు కదా నేడు సమాజం
సమంజసమే మార్పనేది సహజం
జాగృతిలో పడి జాలి మరిచిపోవడం
జాలి జీవితాలు గాలికలా బ్రతకడం
జాగృతి జనం చూసి పైబడి పోవడం
నాటి, అమ్మ కథలు నేడు కాదు వాస్తవం
వాస్తవాలే నేడు చూడు కథలు కదా నేస్తం
బాల్యమెటుబోయెనో బోసిపోయే నా నవ్వులు
యువకులెటుబోయారో వృద్దులాయె నందరు
అత్తగారి రొసరోసలు కోడలమ్మ గుసగుసలు
ముద్దులొలుకు మనువలతో పొద్దు మరచు తాతలు
పండగలూ, పబ్బాలు. పిండి వంట లార్బాటం
ప్రేమతోడ పలకరింపు, పరామర్శలు
ఎటుబోయెన్ ఎటుబోయెన్ ఇటురావా ఆ రోజుల్
ఎటుబోయెన్ ఆ రోజులు ఇటురావా
ఇటురావా ఇక రావా ఆరోజుల్ ఆ రోజుల్
==========================
తెలుగు రచన
యలమంచిలి వెంకటరమణ
No comments:
Post a Comment