1788
తెలుగు రచన
19/07/2018
=================
పడిఉంటే సిమెంటు స్థంభం
ఇంటి కది మూలస్థంభం
ఇప్పుడిది కరంటు స్థంభం
ప్రాణం లేకున్నా తనపనిలో బద్దం
ఇనప స్థంభం,సిమెంటు స్థంభం
విశేషం కార్యార్థంతో కట్టుబడుండడం
క్రమశిక్షణ వాటికి అలంకారం
వాటికే చెల్లుతుంది ఒక త్రాటిపై నిలబడడం
అప్పుడెప్పుడో అది దీపఃస్థంభం
ఇప్పుడదే కదా కరంటు స్థంభం
మనుషితోనే వాటి సంభందం
చరిత్రకారుల వెలుగు బంధం
అబ్రహంలింకన్ తో విద్యా బంధం
అంబేడ్కర్ దీ అదే అనుబంధం
అప్పుడంటే అది వీధి స్థంభం
వారి చరిత్రకదే మూలస్థంభం
పల్లెటూరుల్లో వాటిన్ కాస్త
కిందకే యించుకుందాం
కరంటేలాగూ రాదందులో
బట్టలన్నా ఆరేసుకుందాం
================
యలమంచిలి వెంకటరమణ...✍
No comments:
Post a Comment