1811
Telugu Rachana
13/11/2018
======================
లలితాకళా ముద్రితేచిత్రమో నీవు
కవిభావనారూప ప్రతిరూపమో నీవు
చూడనీనన్ను వదనారవిందమ్మునూ
పాడనీనన్ను ఈమధురగానమ్మును
నండూరివారి ఆఎంకివానీవు
వేటూరిరసమాధు రీగీతికానీవు
రమణీయబాపు కళారూపమాలేక
ప్రరబ్రహ్మసృష్టికి దృష్టాంతమా నీవు
చూడనీనన్ను వదనారవిందమ్మునూ
పాడనీనన్ను ఈమధుర గానమ్మును
ఆబాపిరాజు శశికళవానీవు
ఆచార్యఆత్రేయ గీతానివానీవు
భీమన్నాకవిగారి వైశాఖివా లేక
సౌందర్యరూపానికో మచ్చువానీవు
చూడనీనన్ను వదనారవిందమ్మునూ
పాడనీనన్ను ఈమధుర గానమ్మును
తొలిచూపులోనే బందించావు
కనులార్పకుండా ననుజేసినావు
మదిలోననీవు స్థిరమయ్యినావు
తొలిప్రేమజ్యోతి వెలిగించినావు
లలితాకళా ముద్రితేచిత్రమో నీవు
కవిభావనారూప ప్రతిరూపమో నీవు
చూడనీనన్ను వదనారవిందమ్మునూ
పాడనీనన్ను ఈమధురగానమ్మును
======================
---------యలమంచిలి వెంకటరమణ......✍
No comments:
Post a Comment