=================================
కబురేదో తెచ్చిందీ కొంటె గాలి
చెవియొగ్గి వింటున్నవి కొమ్మలొంగి
ఏమేమి చెప్పిందో, ఏమో గానీ
ఉత్సుకమై ఊగెనులే,పూల కొమ్మలు
ఉరకలేసె చెల ఏరు వినాల నేమో
మొరాయించె కొండతల్లి కోపమేమో
కోయిలమ్మ కేమిటో ఇంత వేడుక
వంత గలిపి పాడుతుంది కోనతో ఇలా
పల్లె పడుచు పచ్చ చీర ఎగిరి వచ్చెనా
పుడమి గుప్పి నీ చీర అదే అదేనా
సోయగాలు చూడనేమో ఉదయబానుడు
కాంతి ధార పంపెనేమో పొదల మాటుగా
వంగి చూడు ఇంద్రధనస్సు వళ్ళు విరుపులు
నింగి వైపు బారుదీరె పక్షిరాజులు
దూరంగా తీరంలో పడవ పాటలు
భారంగా నిద్ర లేచు వెలుగు రేఖలు
ఇంతందం, ఇదేనా స్వర్గ ద్వారము
ధన్యమెంత, నా భూమిది నాకు గర్వము
=================================
తెలుగు రచన
యలమంచిలి వెంకటరమణ
Thursday, July 4, 2019
కబురేదో తెచ్చిందీ కొంటె గాలి
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment