Thursday, July 4, 2019

దూడ నెరగా జూపి పాలు దోచే వీరి

=======================
దూడ నెరగా జూపి పాలు దోచే వీరి
దూడ కుడిచే పాలు దోచి పూజలు జూడు
తేనె టీగల జంపి నోట తేనెలు తుంచి
జుంటె తేనీయలంటు జుర్రుకొనును వీరు
మేను గప్పగ గోరు మేలైన వస్త్రాలు
పట్టు పురుగుల జంప పాప మనుకోరు
మెడను తురిమి జూడు మేక పిల్లను వీరు
రాతి బొమ్మకు పూజ రక్త స్నానాలు
ఇంట పెరిగే జీవి నెంతయిన వాడి
ఎదురు తిరిగే పులికి ఆమ డుంటారు
మాయ మాటల తోటి మోసపుచ్చే వీరు
చిన్న పెద్దా చూడు వర్ణ భేదాలు
సొమ్ములుంటే గారు అంట రానోళ్లు
ఆకలొన్నా మనిషి తెగువెంచి తినబోవ
దొంగ ముద్ర వేయు అక్కంటి జనులు
నమ్మబోవగా మేలు మూగ జీవులు నేడు
అన్ని దెలిసిన మనిషి ఎంత మోసగాడూ!!
===========================
గురుతుల్యులు    కాండ్రేగుల వెంకట సూర్య నారాయణ గారి  వేదన తో
                      తెలుగు రచన
          యలమంచిలి వెంకటరమణ

No comments:

Post a Comment