Thursday, July 4, 2019

నిన్న పోయిన వాడు ఎంత మంచివాడు

===========================
నిన్న పోయిన వాడు ఎంత మంచివాడు
నేడు ఉంటే వాడు లేడు వాడంత చెడ్డోడు
బ్రతుకు చూసీ నీది ఏడ్చేటి వాళ్లే
బ్రతుకు భారమైతే నవ్వేను వీళ్ళు

అప్పు గోరగ జేరి దేవుడంటారు
తిరిగి అడుగ జూడ దుర్భాషలాడేరు
తేట మనుషులయ్య తేలిపోదురిట్టే
అలలు తాళ లేరు వా రొడ్డు జేరు

సొమ్ముసిల్లగ జేసి సొమ్ము గూర్చ నేల
నన్ను మరిచి నీవు ఇన్ని కూర్చ నేల
కొమ్ము గాచువారు లాట్లయ్య నీవెనుక
సొమ్ముకొద్దీ నమ్ము వాయమ్మ వీరంత
===========================

                 తెలుగు రచన
      యలమంచిలి వెంకటరమణ

No comments:

Post a Comment